బావిలో పడిన పామును కాపాడేందుకు వెళితే, భయపడి చుట్టేసుకుంది... పట్టుతప్పింది... వైరల్ వీడియో!
- కేరళలోని త్రిసూర్ లో ఘటన
- పాము కోసం బావిలోకి దిగిన షగిల్
- పైకి వస్తూ, మరోసారి బావిలో పడ్డ వైనం
పామును బయటకు తీసుకుని వస్తున్న క్రమంలో, తనకేదో ఆపద తలెత్తనుందని భావించిందో ఏమో, షగిల్ ను అది గట్టిగా చుట్టేసుకుంది. అయినా, పట్టు వదలకుండా దాన్ని పట్టుకునే ఉన్నాడు షగిల్. బావి పైన ఉన్న స్థానికులు, తాడును నెమ్మదిగా లాగుతుంటే, పై వరకూ వచ్చాడు. అయితే, అతనికి చేతులు పట్టుకుని సాయం చేయాల్సిన వారు, పామును చూసి భయపడ్డారో ఏమో... ఆలస్యం చేశారు. దీంతో షగిల్ పట్టు తప్పి పాముతో సహా బావిలో మరోసారి పడిపోయాడు. అప్పటికి కూడా పాము తలను వదలని షగిల్, రెండో ప్రయత్నంలో దాన్ని బయటకు తీసుకుని వచ్చి, సమీపంలోని అడవిలో వదిలిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.