84 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా నేరస్తులే... వారినెందుకు ఎన్ కౌంటర్ చేయలేదు?: దేవి

  • దిశ నిందితుల ఎన్ కౌంటర్
  • ప్రజా సంఘాలు, మేధావి వర్గాల నుంచి వ్యతిరేకత
  • కసబ్ వంటి తీవ్రవాదిని కూడా చట్టప్రకారమే శిక్షించారన్న దేవి
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై మేధావి వర్గాలు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కసబ్ వంటి కరుడుగట్టిన తీవ్రవాదిని కూడా ఎన్ కౌంటర్ చేయలేదని, చట్టప్రకారమే శిక్షించారంటూ మహిళా సంఘం నేత దేవి స్పందించారు. దేశంలో లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా, ఆ నేరస్తులను ఎందుకు వదిలిపెడుతున్నారని ప్రశ్నించారు.

84 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం నేరారోపణలు ఎదుర్కొంటున్నారని, వారిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయలేదని నిలదీశారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను చట్టం ముందు నిలపాలని, దీనిపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని దేవి వెల్లడించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపించారు. ప్రణాళిక ప్రకారమే నిందితులను అంతమొందించారని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Disha
Hyderabad
Telangana
Police
Encounter

More Telugu News