'బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్' ప్రమాద ఘటన.. ఆసుపత్రి నుంచి నేడు మిలన్ కృష్ణారావు డిశ్చార్జి
- గత నెలలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం
- కారుతో సహా కిందపడిన మిలన్ కృష్ణారావు
- ఆరోగ్యం కుదుటపడ్డాక అదుపులోకి తీసుకుంటామన్న పోలీసులు
గత నెలలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. వంద కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తూ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఫ్లై ఓవర్ కింద ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు.