2020లో తెలంగాణ ప్రభుత్వ సెలవుల జాబితా ఇదిగో!
Add ap7am to your home Screen

2020లో తెలంగాణ ప్రభుత్వ సెలవుల జాబితా ఇదిగో!

  • మొత్తం 28 సాధారణ సెలవులు
  • ఐదు సెలవులు ఆది, రెండో శనివారాల్లో
  • 17 ఐచ్ఛిక సెలవులను ప్రకటించిన తెలంగాణ
2020 సంవత్సరానికిగాను తెలంగాణ ప్రభుత్వం సాధారణ, ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రధాన పండగలైన దసరా, మొహర్రం, ఆగస్టు 15, బాబూ జగ్జీవన్ రామ్ జయంతి తదితరాలు ఆదివారం రానున్నాయి. దీపావళి రెండో శనివారం వచ్చింది.

ఇక సాధారణ సెలవుల విషయానికి వస్తే, న్యూ ఇయర్ (జనవరి 1- బుధవారం), భోగి (జనవరి 14 - మంగళవారం), సంక్రాంతి (జనవరి 15 - బుధవారం), మహా శివరాత్రి (ఫిబ్రవరి 21 - శుక్రవారం) రానున్నాయి. హోళి (మార్చి 9 - సోమవారం), ఉగాది (మార్చి 25 - బుధవారం), శ్రీరామనవమి (ఏప్రిల్ 2- గురువారం), గుడ్ ఫ్రైడే (ఏప్రిల్ 10 - శుక్రవారం), అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14 - మంగళవారం), రంజాన్ (మే 25 - సోమవారం), రంజాన్ మరుసటి రోజు (మే 26 - మంగళవారం) రానున్నాయి.

ఆపై బోనాలు (జూలై 20 - సోమవారం), బక్రీద్ (ఆగస్టు 1 - శనివారం), కృష్ణాష్టమి (ఆగస్టు 11 - మంగళవారం), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15 - శనివారం), వినాయక చవితి (ఆగస్టు 22 - శనివారం), గాంధీ జయంతి (అక్టోబర్ 2 - శుక్రవారం), బతుకమ్మ ప్రారంభోత్సవం (అక్టోబర్ 17 - శనివారం), దుర్గాష్టమి (అక్టోబర్ 24 - శనివారం), మిదాడినబీ (అక్టోబర్ 30 - శుక్రవారం), కార్తీక పౌర్ణమి / గురునానక్ జయంతి (నవంబర్ 30 - సోమవారం), క్రిస్మస్ (డిసెంబర్ 25 - శుక్రవారం), బాక్సింగ్ డే (డిసెంబర్ 26 - శనివారం) రానున్నాయి.

వీటితో పాటు గణతంత్ర దినోత్సవం (జనవరి 26), బాబూ జగ్జీవన్ రామ్ జయంతి (ఏప్రిల్ 5), మొహర్రం (ఆగస్టు 30), విజయదశమి (అక్టోబర్ 25) పండగలు ఆదివారం రాగా, దీపావళి (నవంబర్ 14) రెండో శనివారం వచ్చింది.

ఐచ్ఛిక సెలవుల జాబితా విషయానికి వస్తే, హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్ పురి మహది (జనవరి 10 - శుక్రవారం), కనుమ (జనవరి 16 - గురువారం), శ్రీపంచమి (జనవరి 30 - గురువారం), పబ్ ఏ మేరాజ్ (మార్చి 23 - సోమవారం), మహావీర్ జయంతి (ఏప్రిల్ 6 - సోమవారం), సబ్ ఏ బరాత్ (ఏప్రిల్ 9 - గురువారం), బుద్ధ పూర్ణిమ (మే 7 - గురువారం), షహదత్ హజ్రత్ అలీ (మే 14 - గురువారం), షబ్ ఏ ఖదర్ (మే 21 - గురువారం), జుమతుల్ విదా (మే 22 - శుక్రవారం), రథయాత్ర (జూన్ 23 - మంగళవారం), వరలక్ష్మీ వ్రతం (జూలై 31 - శుక్రవారం), రాఖీ పౌర్ణమి (ఆగస్టు 3 - సోమవారం), మొహర్రం (ఆగస్టు 29 - శనివారం), అర్బాయిన్ (అక్టోబర్ 8 - గురువారం), యాజ్ దుషమ్ షరీఫ్ (నవంబర్ 27 - శుక్రవారం), క్రిస్మస్ ఈవ్ (డిసెంబర్ 24 - గురువారం) రానున్నాయి.

ఐచ్చిక సెలవుల్లో బసవ జయంతి (ఏప్రిల్ 26), ఈద్ ఏ గధీర్ (ఆగస్టు 9), పార్శి కొత్త ఏడాది రోజు (ఆగస్టు 16) ఆదివారం రానున్నాయి.
Telangana
2020
Holidays

More Telugu News