చంద్రబాబు అప్పుడు సోనియాను ఆశ్రయించారు.. ఇప్పుడు మోదీని ఆశ్రయిస్తున్నారు: ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
- తెలంగాణలో టీడీపీ శకం ముగిసింది.. ఇక ఏపీలో కూడా కనుమరుగవుతుంది
- చంద్రబాబు ఔట్ డేటెడ్ నేత.. లోకేశ్ అప్ డేట్ కాని నేత అంటూ విమర్శ
- అరాచక శక్తులను ప్రోత్సహించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు
గతంలో తన రాజకీయ అవసరాలకోసం సోనియా కాళ్లు పట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో టీడీపీ శకం ముగిసిందని, ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ కనుమరుగవుతుందని అన్నారు. చంద్రబాబు నిజాయతీ పరుడైతే తనపై ఉన్న కేసులకు సంబంధించి తెచ్చుకున్న స్టే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఆయన జీవితమంతా స్టేలు తెచ్చుకోవడంతోనే సరిపోయిందని విమర్శించారు. చంద్రబాబు ఔట్ డేటెడ్ నేత అయితే, లోకేశ్ అప్ డేట్ కాని నేత అని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.