దుర్గం చెరువు కొత్త లుక్... ఫొటోలు షేర్ చేసిన కేటీఆర్
Add ap7am to your home Screen

దుర్గం చెరువు కొత్త లుక్... ఫొటోలు షేర్ చేసిన కేటీఆర్

  • దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం
  • ట్విట్టర్ లో ఫొటోలు పోస్టు చేసిన కేటీఆర్
  • ఐటీ కారిడార్ కు రవాణా సులువు అవుతుందంటున్న ఇంజినీర్లు
హైదరాబాద్ లోని దుర్గం చెరువు ప్రాంతాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కారు అనేక ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు, ఈ చెరువుపై వంతెన నిర్మిస్తే రవాణా ఎంతో సులువుగా మారుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగా బలమైన తీగెలతో వంతెన నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులకు సంబంధించిన అప్ డేట్స్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ ను పలు కోణాల్లో ఫొటోలు తీసి వాటిని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరితో పంచుకున్నారు. కాగా, ఈ వంతెన నిర్మాణం పూర్తయితే నగరంలోని అనేక ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ కు రవాణా సులభతరం అవుతుందని ఇంజినీరింగ్ సిబ్బంది తెలిపారు.
KTR
Durgam Cheruvu
Hyderabad
Telangana

More Telugu News