సుప్రభాతం సంస్కృతంలో ఉంటుందని ఆ జ్ఞానికి తెలియదు: పవన్ పై విజయసాయిరెడ్డి కౌంటర్
Add ap7am to your home Screen

సుప్రభాతం సంస్కృతంలో ఉంటుందని ఆ జ్ఞానికి తెలియదు: పవన్ పై విజయసాయిరెడ్డి కౌంటర్

  • పవన్ పై విజయసాయి పరోక్ష విమర్శలు
  • శ్రీవేంకటేశ్వర సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్ లో చదివించండని అంటున్నారు
  • ఎవరైనా బ్రీఫ్ చేస్తే తప్ప దేనిపై ఎలా విమర్శించాలో అంతుబట్టనట్టుంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పరోక్ష విమర్శలు గుప్పించారు. శ్రీవేంకటేశ్వర సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్ లో చదివించండని 'నిత్య కళ్యాణం' అనడం చూస్తుంటే... ఆయన రెండు లక్షల పుస్తకాలు చదివింది ఎంత నిజమో తెలిసిపోతుందని ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు. సుప్రభాతం సంస్కృతంలో ఉంటుందని ఆ జ్ఞానికి తెలియదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా బ్రీఫ్ చేస్తే తప్ప దేనిపై ఎలా విమర్శించాలో అంతుబట్టనట్టుంది అని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan
Janasena
Vijaysai Reddy
YSRCP

More Telugu News