హాలీవుడ్ సినిమాకు డబ్బింగ్ చెబుతున్న మహేశ్ బాబు కుమార్తె
- ఫ్రోజెన్-2 చిత్రంలో సితార డబ్బింగ్
- ఎల్సా చిన్నప్పటి పాత్రకు గొంతు అరువిస్తున్న సితార
- నవంబరు 22న రిలీజ్ కానున్న ఫ్రోజెన్-2
గతంలో వచ్చిన ఫ్రోజెన్ విజయవంతం కావడంతో దానికి సీక్వెల్ గా ఫ్రోజెన్-2 తెరకెక్కించారు. కాగా, ఎల్సా పెద్దయ్యాక పాత్రకు నటి నిత్యా మీనన్ డబ్బింగ్ చెబుతోంది. ఒకప్పుడు ఇంగ్లీషు చిత్రాలకు సాధారణ ఆర్టిస్టులతోనే డబ్బింగ్ చెప్పించేవాళ్లు. ఇటీవల కొంతకాలంగా ప్రముఖ సినీ నటులే హాలీవుడ్ సినిమా పాత్రలకు గొంతుక అరువిస్తున్నారు.