ఈ రూమర్లు ఏమిటో.. అసలు సూర్య, అజిత్ లకు నేను కథే చెప్పలేదు!: మురుగదాస్
- వారితో సినిమా ఖరారు కాలేదన్న మురుగదాస్
- సూర్యతో సినిమా ప్రారంభించలేదని వెల్లడి
- దర్బార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న మురుగదాస్
ఆఖర్లో అజిత్ నిరాకరించడంతో మళ్లీ సూర్య వద్దకే వెళ్లారని, ఆయన ఈసారి నో చెప్పారని కూడా మురుగదాస్ పై కథనాలు వినిపించాయి. వీటిపై మురుగదాస్ స్పందిస్తూ.. అవన్నీ పుకార్లని కొట్టి పారేశారు. ఈ రూమర్లు ఏమిటో, ఎవరు పుట్టించారో తెలియదని, కథ వినిపించడానికి సూర్య, అజిత్ లను అసలు కలవనేలేదని స్పష్టం చేశారు. వారితో సినిమా చేసే విషయం ఖరారు కాలేదని తెలిపారు.