పాక్ రైలులో అగ్ని ప్రమాదం: 62కి చేరిన మృతుల సంఖ్య

  • కోడి గుడ్లు ఉడకపెట్టడానికి గ్యాస్‌ వెలిగించిన ప్రయాణికులు
  • ఈ కారణంగానే మంటలు?
  • ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ విచారం
పాకిస్థాన్ లోని లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న తేజ్‌గావ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. రహీమ్ యార్‌ఖాన్ సమీపంలోని లియాఖత్‌పూర్ వద్ద రైలులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో 62 మంది సజీవ దహనమయ్యారని, మరో 13 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రైలులో మంటలు చెలరేగడంతో రెండు బోగీలు దగ్ధమయ్యాయని వివరించారు.

ప్రయాణికుల్లో కొందరు కోడి గుడ్లు ఉడకపెట్టడానికి గ్యాస్‌ వెలిగించారని, ఈ కారణంగానే మంటలు చెలరేగాయని సమాచారం. అగ్నిమాపక దళాలు, ఆర్మీ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Go Back to Shorts
imran khan
Pakistan
Train Accident

More Telugu News