ఇప్పటికైనా అర్థమైందా? ప్రతిసారీ అలానే గెలుస్తామంటే కుదరదు: బీజేపీకి ఒవైసీ చురక
- హర్యానాలో మోదీ 15 సార్లు ప్రచారం చేసినా ఫలితం నిల్
- ఎప్పటికీ మోదీ హవా పనిచేయదు
- ఇకనైనా ఆర్థిక రంగంపై దృష్టిపెట్టండి
మరోవైపు, బీజేపీపై ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడూ మోదీ హవాపైనే గెలవాలనుకుంటే కుదరదని అన్నారు. హర్యానాలో మోదీ 15 ర్యాలీలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ చేస్తామని ప్రగల్బాలు పలికినా చతికిల పడ్డారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మోదీ హవాను నమ్ముకోవడం మాని ఆర్థిక రంగంపైనా, గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టి సారించాలని బీజేపీకి హితవు పలికారు.