అర్ధ శతకాలతో అదరగొట్టేసిన రోహిత్, రహానె.. టీమిండియా స్కోరు 150/3
- రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచు
- క్రీజులో రోహిత్ (77), రహానె (50)
- రబాడకు రెండు వికెట్లు
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా (22 బంతుల్లో 12 పరుగులు) అన్రిచ్ నొర్జే బౌలింగ్ లో తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడిందని అంతా భావించారు. అయితే, క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్ శర్మ, అజింక్యా రహానె ధాటిగా ఆడుతున్నారు. ప్రస్తుతం రోహిత్ 77, రహానె 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.