ఇసుక కొరతపై మరోసారి ఆందోళనకు దిగనున్న టీడీపీ
- ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం
- మాతో కలిసొచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో దీక్షలు చేపడతాం
- కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం
తమతో కలిసొచ్చే పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకుని ఈ నిరాహార దీక్షలు చేపడతామని అన్నారు. ఇసుక కొరత కారణంగా సంబంధిత విభాగాల్లో పని చేసే కార్మికులు కుదేలైన నేపథ్యంలో ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని వర్ల రామయ్య పేర్కొన్నారు.