కేసీఆర్ ఫాంహౌస్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యుల ఆరోపణలు
- మీడియాతో మాట్లాడిన వెంకటేశ్వర్లు కుమారుడు
- అనిల్ అనే మరో కానిస్టేబుల్ పై ఆరోపణలు
- ఏదైనా జరిగితే ఆ బాధ్యత అనిల్ దేనని నాన్న చెప్పారు
తన తండ్రితో తాను నిన్న మాట్లాడానని, తనపై దాడి జరిగిందని ఆయన మరోసారి తెలిపారని అన్నారు. తనకు ఏదైనా జరిగితే ఆ బాధ్యత అనిల్ దేనని తన తండ్రి ఫోనులో చెప్పారని వివరించారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న సమయంలో వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఉన్నట్లు సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డి ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే.