కోహ్లీసేనకు తీసిపోని అమ్మాయిలు... సఫారీలను క్వీన్ స్వీప్ చేశారు!
- మూడు వన్డేల సిరీస్ 3-0తో కైవసం
- చివరి వన్డేలో 6 పరుగుల తేడాతో గెలుపు
- స్వల్ప స్కోర్ల మ్యాచ్ లో టీమిండియా మహిళల అద్భుత ప్రతిభ
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 45.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైనా, బౌలర్ల ప్రతిభతో మ్యాచ్ మన చేతుల్లోకొచ్చింది. లక్ష్యఛేదనలో సఫారీలు 140 పరుగులకే చాప చుట్టేశారు. ఏక్తా బిస్త్ 3, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెరో 2 వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్నువిరిచారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పురుషుల జట్టు కూడా భారత్ లోనే పర్యటిస్తుండగా, మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ 2-0తో కోహ్లీసేన వశమైంది.