కేసీఆర్ నిర్ణయంతో ఒంటికి నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్... ఖమ్మంలో ఉద్రిక్తత
- సమ్మెలో పాల్గొన్నవాళ్లకు జీతాలు ఇవ్వబోమన్న కేసీఆర్
- మనస్తాపం చెందిన ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి
- ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న వైనం
ఈ ఘటనలో శ్రీనివాసరెడ్డిని కాపాడబోయి అతని కుమారుడు సురేశ్ కూడా గాయపడ్డాడు. జీతాలు ఇవ్వబోమని కేసీఆర్ ప్రకటించడంతోనే శ్రీనివాసరెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడని అతని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనతో ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. ఇతర ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో శ్రీనివాసరెడ్డి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వచ్చి సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు.