మేఘ కృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు!
- ఏక కాలంలో 30 చోట్ల దాడులు
- పలు కీలక పత్రాలు స్వాధీనం
- ఇవి సాధారణ తనిఖీలే : మేఘా ప్రతినిధి
దేశ వ్యాప్తంగా 30 చోట్ల ఉన్న కంపెనీకి సంబంధించిన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బాలానగర్ కార్యాలయం, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్టు కార్యాలయం, ఎంసీహెచ్ఆర్డీ సమీపంలోని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
కాగా, ఐటీ సోదాలపై మేఘ సంస్థ కూడా స్పందించింది. రెండేళ్లకోసారి ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇలా తనిఖీలు చేయడం సర్వసాధారణమేనని, ఇప్పుడు కూడా జరుగుతున్నవి సాధారణ తనిఖీలేనని సంస్థ ప్రతినిధి తెలిపారు.