‘గ్రీన్ ఛాలెంజ్’.. ఎంపీ సంతోష్ కుమార్, హీరో అఖిల్ అక్కినేనికి నటుడు వరుణ్ తేజ్ ‘థ్యాంక్స్’
- తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన వరుణ్ తేజ్
- గ్రీన్ ఛాలెంజ్ కు తమన్నా, సాయి పల్లవి నామినేట్
- ఇలాంటి పనులకు సమయం కేటాయించడం సంతోషంగా ఉంది: వరుణ్ తేజ్
ఈ సందర్భంగా ఆ ఫొటోలను వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. గ్రీన్ ఛాలెంజ్ కు తనను నామినేట్ చేసిన సంతోష్ కుమార్ కి, హీరో అక్కినేని అఖిల్ కు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. షూటింగ్ కారణంగా కొంత బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి ముఖ్యమైన పనులకు సమయం కేటాయించడం సంతోషంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో అన్నాడు. ఈ సందర్భంగా హీరోయిన్లు తమన్నా, సాయి పల్లవికి వరుణ్ తేజ్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.