నాగ్... మన బిడ్డకు 30 ఏళ్లు: రామ్ గోపాల్ వర్మ!

  • 1989, అక్టోబర్ 5న విడుదలైన 'శివ'
  • 30 ఏళ్లయిందని గుర్తు చేసిన వర్మ
  • ట్విట్టర్ లో ప్రత్యేక ట్వీట్
సరిగ్గా 30 ఏళ్ల క్రితం... అంటే, 1989 అక్టోబర్ 5. ఆ రోజున టాలీవుడ్ కింగ్ నాగార్జున, అమల హీరో హీరోయిన్లుగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'శివ' విడుదలైన రోజు. ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఆ చిత్రం షూటింగ్ సమయంలో ఏర్పడ్డ పరిచయం, నాగార్జున జీవిత భాగస్వామిగా అమల మారేట్టుగా చేసింది కూడా.

అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలోకి కాలుమోపిన వర్మ, పరిశ్రమకు కొత్తదనాన్ని పరిచయం చేస్తూ 'శివ'ను తీశాడు. ఇక ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా, తన ఆనందాన్ని పంచుకుంటూ, "నాగ్. నేడు మన ప్రియమైన బిడ్డ 30వ పుట్టినరోజు" అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Ramgopal Varma
Twitter
Shiva

More Telugu News