హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థిపై నేడు ప్రకటన?
- ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు
- రెండు రోజులుగా టీ-టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చలు
- నేడు హైదరాబాద్ రానున్న చంద్రబాబు
నేడు హైదరాబాద్ కు చంద్రబాబు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం టీ-టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. హుజూర్ నగర్ అభ్యర్థి ఎంపిక విషయలో తుది నిర్ణయం తీసుకుంటారని, అనంతరం, ఈ మేరకు ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా, వచ్చే నెల 21న ఉపఎన్నిక జరగనుంది. 24న కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల ఫలితాలు వెలువరిస్తారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపుపై ఇప్పటికే ఎనలేని ధీమాను వ్యక్తం చేశాయి.