ధోనీ ఒక్కరోజులోనే గొప్ప వికెట్ కీపర్ కాలేదు, పంత్ ను అర్థం చేసుకోండి: యువరాజ్ సింగ్
- పంత్ పేలవ ప్రదర్శన
- కోచ్, చీఫ్ సెలెక్టర్ హెచ్చరించినట్టు వార్తలు
- పంత్ ను ఒత్తిడికి గురిచేయొద్దన్న యువీ
పేలవ ప్రదర్శన నేపథ్యంలో పంత్ ను కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ హెచ్చరించినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ, పంత్ నుంచి అత్యుత్తమ ఆటతీరు ఆశించేవాళ్లు ముందు అతడి ఆలోచన విధానాన్ని అవగాహన చేసుకోవాలని టీమిండియా మేనేజ్ మెంట్ కు హితవు పలికాడు.