రేవంత్ రెడ్డి నాకు ముద్దుల అన్నయ్య.. నాపై అలా ఎందుకు మాట్లాడారో?: టీ-కాంగ్రెస్ నేత సంపత్ కుమార్
- యురేనియం విషయంలో సంపత్ కు ఏం తెలియదన్న రేవంత్
- రేవంత్ లా ఏది పడితే అది మాట్లాడను
- ఈ వ్యాఖ్యలపై స్పందించిన సంపత్ కుమార్
తాను పీహెచ్ డీ చేశానని, ఆ విషయం ప్రజలకు తెలుసని అన్నారు. రేవంత్ లా ఏది పడితే అది మాట్లాడనని, ఏ విషయంపైన అయినా పూర్తి సమాచారంతోనే మాట్లాడతానని చెప్పిన సంపత్, రేవంత్ తనకు ముద్దుల అన్నయ్య అని, ఆయన అలా ఎందుకు మాట్లాడారో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. యురేనియం తవ్వకాలపై ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీ చందర్, తనకు మాత్రమే ఆహ్వానం ఉందని, రేవంత్ కు లేదని చెప్పారు.