నాలుగు నిమిషాల యాక్షన్ సీన్ కోసం 4 నుంచి 5 కోట్ల ఖర్చు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాలుగు నిమిషాల యాక్షన్ సీన్ కోసం 4 నుంచి 5 కోట్ల ఖర్చు

  • వీఐ ఆనంద్ నుంచి 'డిస్కోరాజా'
  • రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు 
  • యూరప్ లో యాక్షన్ సీన్ చిత్రీకరణ
రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' రూపొందుతోంది. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే 15 రోజులపాటు గోవాలో ఒక షెడ్యూల్ షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లింది.

ఈ నెల 17వ తేదీ నుంచి యూరప్ లోని ఐస్ లాండ్ లో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నారు. ఇది డిఫరెంట్ గా అనిపించే యాక్షన్ సీన్. అందువల్లనే హాలీవుడ్ మూవీ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7' కి పనిచేసిన స్టంట్ మాస్టర్లు ఈ సీన్ ను డిజైన్ చేశారు. 4 నిమిషాల నిడివి కలిగిన ఈ యాక్షన్ సీన్ చిత్రీకరణకు 4 నుంచి 5 కోట్లవరకూ ఖర్చు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. రవితేజ సరసన పాయల్ .. నభా .. తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తుండటంతో, మాస్ ఆడియన్స్ లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది.
Raviteja
Payal
Nabha
Thanya

More Telugu News