బిగ్ బాస్-3: లేడీ కంటెస్టెంట్లకు నాగార్జున ఘాటు హెచ్చరికలు!
- పునర్నవి, శ్రీముఖిలపై నాగ్ ఫైర్
- సరిగా మాట్లాడాలంటూ పునర్నవికి హితవు
- ఈ హౌస్ కు నువ్వు కాదు బాస్ అంటూ శ్రీముఖికి వార్నింగ్
ఇక శ్రీముఖిపైనా నాగ్ విరుచుకుపడ్డాడు. ఈ హౌస్ కు నువ్వు కాదు బాస్... బిగ్ బాసే ఈ హౌస్ కు అసలైన బాస్ అంటూ స్పష్టం చేశాడు. నీ గేమ్ చూస్తుంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టుగా ఉందంటూ నిర్మొహమాటంగా విమర్శించాడు. ఓవైపు శ్రీముఖి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా నాగ్ ఆమెను మాట్లాడనివ్వలేదు. గత ఎపిసోడ్ లకు భిన్నంగా ఈ వీకెండ్ ఎపిసోడ్ వాడీవేడిగా సాగుతుందని ప్రోమో చెబుతోంది.