మా ఆటగాళ్ల నిర్ణయం వెనుక ఇండియా లేదు: పాకిస్థాన్ వ్యాఖ్యలను ఖండించిన శ్రీలంక
- మా ఆటగాళ్లపై భారత్ ఒత్తిడి చేయలేదు
- ఉగ్రదాడి కారణంగా పాక్ లో పర్యటించేందుకు వారు భయపడుతున్నారు
- పాక్ ను పాక్ గడ్డపై ఓడిస్తామనే నమ్మకం ఉంది
శ్రీలంకలో పర్యటించేందుకు ఏంజెలో మాథ్యూస్, లసిత్ మలింగ, దినేశ్ చండిమాల్, దిముతు కరుణరత్నె, అఖిల ధనంజయ, కుశాల్ పెరీరా, నిరోషన్ డిక్వెలా, తిసారా పెరీరా, సురంగ లక్మల్ లు అయిష్టతను వ్యక్తం చేశారు. భద్రతా కారణాల వల్ల తాము పాక్ లో పర్యటించలేమని స్పష్టం చేశారు.