నరేంద్ర మోదీకి పాములు పంపుతానంటున్న పాక్ గాయని.. నెటిజన్ల సెటైర్లు!
- పాక్ లో గాయని రబీ పిరజాదా
- మొసళ్లు, పాములతో వీడియో
- సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్న నెటిజన్లు
పాములు, మొసళ్లతో తానున్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఆమె, తాను కశ్మీరీ యువతినని చెప్పింది. వీటిని నరేంద్ర మోదీకి గిఫ్ట్ గా ఇచ్చి, ఆపై చనిపోయిన తరువాత నరకానికి వెళ్లేందుకు కూడా సిద్ధమని చెప్పింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో, పలు రకాల సెటైర్లు వస్తున్నాయి. జోకులు నవ్వు వచ్చేట్టు ఉండాలని, జోక్ కన్నా ముందే నవ్వు వస్తోందని, ఈ వీడియో చూసిన ఇండియన్ నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.