తెలంగాణ కేబినెట్లోకి కేటీఆర్, గుత్తా.. ఇద్దరు మహిళలకు చోటు?
- అన్నీ కుదిరితే నేడు మంత్రి వర్గ విస్తరణ
- పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా
- విస్తరణా?.. పునర్ వ్యవస్థీకరణా?
కేసీఆర్కు ముహూర్తాలపై మంచి నమ్మకం ఉంది. ఆయన ఏ పని చేసినా ముహూర్తాలు చూసుకునే ప్రారంభిస్తారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నేడు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఈ రోజు కాకుంటే వచ్చే నెల 4, 12వ తేదీలలో విస్తరణ కానీ, లేదంటే పునర్ వ్యవస్థీకరణ కానీ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఇక, గత కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించలేదన్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు ఈసారి ఏకంగా ఇద్దరు మహిళలకు చోటు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.