తొలి 'త్రివిద దళాల అధిపతిగా' గా బిపిన్ రావత్?
- నిన్న తన ప్రసంగంలో సీడీఎస్ ను ప్రకటించిన మోదీ
- మోదీ మనసులో రావత్ పేరే ఉన్నదంటున్న అధికారులు
- నవంబర్ లోగా నియామకానికి అవకాశం
కాగా, 1999లో కార్గిల్ యుద్ధం తరువాత త్రివిధ దళాధిపతులకు చీఫ్ గా ఒకరిని నియమించాలని వాజ్ పేయి భావించారు. సైనిక సంబంధిత విషయాల్లో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఓ అధికారి ఉండాలని అప్పట్లో వాజ్ పేయి భావించారు. ఏవైనా ఆపరేషన్స్ కు ప్రణాళికలు, నియామకాలు, శిక్షణ, ఆయుధాల సరఫరా తదితరాల విషయంలో ప్రస్తుతం ఆర్మీ, నేవీ, వాయుసేనలు విడివిడిగా తమ వ్యూహాలను ప్రభుత్వంతో పంచుకుంటున్నాయి. ఇకపై ఈ విధానాన్ని మార్చాలని నిర్ణయించుకున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు సీడీఎస్ పేరిట కొత్త పదవిని సృష్టించింది.
ఇదిలావుండగా, నవంబర్ నాటికి సీడీఎస్ నియామకం పూర్తవుతుందని, ఆయన విధి విధానాలు ఖరారు చేసేందుకు ఓ కమిటీ కూడా ఏర్పాటవుతుందని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ బిపిన్ రావత్ తో పోలిస్తే, వాయుసేన చీఫ్ గా ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాకు సీనియారిటీ ఎక్కువ. అయితే, ధనోవా సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఇదే సమయంలో రావత్ పదవీ కాలం డిసెంబర్ 31 వరకూ ఉండటంతో ఆయనే తొలి సీడీఎస్ అని అధికారులు అంటున్నారు.