ఈ కెప్టెన్ ఉంటే గెలవడం కష్టమే: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు లేఖ రాసిన కోచ్
- సర్ఫరాజ్ ను తప్పించాలని కోరిన మికీ ఆర్థర్
- వన్డేలు, టి20లకు షాదాబ్ ఖాన్, టెస్టుల్లో బాబర్ కు పగ్గాలు అప్పగించాలని సూచన
- సర్ఫరాజ్ కంటే ముందే జాగ్రత్త పడిన ఆర్థర్!
ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ప్రదర్శన అంతంతమాత్రంగా ఉండడంతో కెప్టెన్, కోచ్ లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో, కెప్టెన్ కంటే ముందుగా తానే బోర్డుకు రిపోర్టు ఇవ్వడం ద్వారా ఆర్థర్ తనపై వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టు అర్థమవుతోంది.