తీసిన తొలి వికెట్ కే ఐసీసీ ఆగ్రహానికి గురైన టీమిండియా పేసర్ సైనీ
- విండీస్ తో తొలి టి20లో పూరన్ వికెట్ తీసిన సైనీ
- రెచ్చిపోయి సంబరాలు చేసుకున్న వైనం
- పూరన్ దిశగా రెచ్చగొట్టే సంజ్ఞలు
వికెట్ పడిన ఆనందంలో సైనీ సంబరాలు కాస్త శ్రుతి మించాయని ఐసీసీ భావించింది. అయితే, తన తప్పును సైనీ ఒప్పుకోవడంతో ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.5 కింద లెవల్ 1 తప్పిదంగా భావించి మందలింపుతో సరిపెట్టారు. అంతేకాకుండా, ఒక డీమెరిట్ పాయింట్ ను సైనీ ఖాతాలో వేశారు. మరో డీమెరిట్ పాయింట్ వస్తే ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.