చార్మినార్ ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహిస్తున్న వైద్య విద్యార్థినిపై కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
- కాళ్లతో తొక్కి, గోళ్లతో గట్టిగా గిచ్చిన కానిస్టేబుల్
- బాధతో అరుస్తూ విలవిల్లాడిన వైద్య విద్యార్థిని
- కానిస్టేబుల్ ప్రవర్తనపై సర్వత్రా నిరసన
కాళ్లతో తొక్కి, గోళ్లతో గట్టిగా గిచ్చడంతో సదరు విద్యార్థిని బాధతో గట్టిగా అరుస్తూ విలవిల్లాడిపోయింది. ఈ దృశ్యం కెమెరా కంటికి చిక్కడంతో సదరు కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో కానిస్టేబుల్ ప్రవర్తనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆరా తీస్తున్నారు.