తనను చూడగానే విలపించిన అమ్మాయిని దగ్గరికి తీసుకుని ఓదార్చిన విజయ్ దేవరకొండ
Add ap7am to your home Screen

తనను చూడగానే విలపించిన అమ్మాయిని దగ్గరికి తీసుకుని ఓదార్చిన విజయ్ దేవరకొండ

  • ఎయిర్ పోర్టు వద్ద సంఘటన
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
  • సౌతిండియాలో విజయ్ కి పెరుగుతున్న క్రేజ్
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు సౌతిండియా స్టార్ అయిపోయాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి చిత్రాలతో విశేషమైన ప్రజాదరణ సొంతం చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ విజయ్ కి అభిమానులు తయారయ్యారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడీ క్రేజీ హీరో ఏ నగరానికి వెళ్లినా అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. తాజాగా, ఎయిర్ పోర్టు వద్ద విజయ్ దేవరకొండను చూడగానే ఓ అమ్మాయి భావోద్వేగాలు తట్టుకోలేక గట్టిగా విలపించింది. దాంతో విజయ్ ఆ అమ్మాయిని అనునయంగా దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Vijay Devarakonda
Tollywood
Airport

More Telugu News