ఒక మృగం వంటి పాత్రలో కనిపించబోతున్నాను: హీరో విక్రమ్
- మణిరత్నం తాజా చిత్రంగా 'పొన్నియన్ సెల్వన్'
- 'ఆదిత్య కరికాలన్' పాత్రలో విక్రమ్
- బరువు పెరుగుతున్నానన్న విక్రమ్
ఈ సినిమాలో 'ఆదిత్య కరికాలన్' పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఈ పాత్ర చాలా భయంకరమైన మనస్తత్వంతో ఉంటుందనీ, ఒక రకంగా మానవ మృగం వంటి పాత్ర ఇదని అంటున్నారు. అలాగని చెప్పేసి ఇది విలన్ పాత్ర కాదు .. విలన్ పాత్రకి ఎంతమాత్రం తగ్గని పాత్ర. ఈ తరహా పాత్రలో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను .. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈ సినిమా కోసం మరింత బరువు పెరిగే పనిలో వున్నాను" అని చెప్పుకొచ్చాడు.