కర్ణాటక సీఎం కుమారస్వామికి జ్యోతిష్యుల హెచ్చరికలు... కొట్టి పారేసిన జేడీ (ఎస్)!
- రేపు విశ్వాస పరీక్ష జరిగే అవకాశం
- వెంటనే జరపకుంటే పార్టీకి తీవ్ర నష్టం
- జ్యోతిష్యులు వెల్లడించినట్టు ప్రచారం
- బీజేపీయే చేయిస్తోందన్న జేడీఎస్ నేతలు
కాగా, శనివారం నాడు 'రైట్ లాగ్' న్యూస్ బ్లాగ్ లో పలువురు జ్యోతిష్యులు, కుమారస్వామి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తూ, ఆయన వెంటనే విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని సూచించారు. ఆలస్యం చేస్తే అది జేడీఎస్ కు తీరని నష్టాన్ని మిగులుస్తుందని హెచ్చరించారు. కాగా, సోషల్ మీడియాలో బీజేపీ ఓ కలుపు మొక్కను నాటిందని, ఇలాంటి దుష్ప్రచారాలు ఎంతో కాలం నిలవవని జేడీఎస్ అధికార ప్రతినిధి రమేష్ బాబు మండిపడ్డారు.