రూ.5 లక్షలలోపు వార్షికాదాయానికి పన్నులేదు.. గృహ రుణాల వడ్డీని తగ్గిస్తున్నాం!: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రం
- ఐటీ రిటర్నులకు పాన్ లేదా ఆధార్ ఉంటే చాలు
- రూ.3.5 లక్షలలోపు గృహ రుణాలపై వడ్డీ పూర్తిగా మాఫీ
బడ్జెట్ 2019-20 హైలైట్స్
- 2019-20 నుంచి వార్షికాదాయం పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు
- అంటే రూ.5 లక్షలకు మించి ఆదాయం పొందేవారే పన్ను కట్టాల్సి ఉంటుంది
- ఎలక్ట్రానిక్ వాహనాలు కొంటే ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తాం
- ఐటీ రిటర్నుల దాఖలు పాన్ లేదా ఆధార్ ఉంటే చాలు
- స్టార్టప్ కంపెనీలకు ఐటీ శాఖ తనిఖీల నుంచి మినహాయింపు
- ఇంటి రుణాలపై వడ్డీ తగ్గింపు.. రూ.45 లక్షల వరకూ రుణాలపై రూ.3.5 లక్షలు మాఫీ
- గృహ రుణాలపై అదనంగా మరో రూ.లక్షన్నర వరకూ వడ్డీ తగ్గింపు
- 2018-19లో ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.11.37 లక్షల కోట్లకు చేరింది
- అపరిచిత నగదు జమ నియంత్రణకు ప్రత్యేక విధానం
- డ్వాక్రా సంఘాలకు దేశవ్యాప్తంగా వడ్డీ రాయితీ పథకం ప్రకటన