ఉపాధ్యాయులపై దాడి చేసిన వారితో జగన్.. మీరెవరి వైపు?: లోకేశ్

ఉపాధ్యాయులపై దాడి చేసిన వారితో జగన్.. మీరెవరి వైపు?: లోకేశ్

Jagan with those who attacked teachers whose side are you on Nara Lokesh
  • టీచర్లపై దాడి చేసిన వారు జగన్‌తో ఉన్నారన్న లోకేశ్
  • నిందితుల ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన మంత్రి
  • పలువురు రౌడీషీటర్ల పేర్లు బహిర్గతం
  • తాను టీచర్ల వైపు, జగన్ రౌడీల వైపు అని వ్యాఖ్య
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, రౌడీషీటర్లకు మధ్య సంబంధాలు ఉన్నాయంటూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన పలువురు రౌడీషీటర్లు జగన్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఆయన బుధవారం రాత్రి తన 'ఎక్స్' ఖాతాలో విడుదల చేశారు. వైసీపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న హింసకు సంబంధించిన వీడియోలను కూడా ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.

పణుగంటి చైతన్య, ఎస్. సందీప్, ఆవుటు శ్రీనివాసరెడ్డి, బంకా అరుణ్ సహా పలువురి పేర్లను లోకేశ్ ప్రస్తావించారు. దాడికి పాల్పడిన వారు జగన్‌తో కలిసి ఉన్న చిత్రాలను ఆయన సాక్ష్యాలుగా పోస్ట్ చేశారు. జగన్ రౌడీషీటర్ల పక్షాన నిలవగా, తాను మాత్రం ఉపాధ్యాయులు, క్రీడాకారుల పక్షాన నిలబడ్డానని లోకేశ్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల వైపు ఉండాలో, రౌడీల వైపు ఉండాలో ప్రజలే తేల్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. 
Advertisement
Nara Lokesh
YS Jagan Mohan Reddy
Vijayawada teacher attack
Andhra Pradesh politics
Rowdy sheeters
YCP violence

More Telugu News