బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్.. బెదిరించి లక్షలు వసూలు చేసిన కేసులో కటకటాల్లోకి

బిగ్‌బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్.. బెదిరించి లక్షలు వసూలు చేసిన కేసులో కటకటాల్లోకి

Bigg Boss fame Varshini arrested for extorting lakhs through threats
  • బిగ్‌బాస్ తమిళ్ ఫేమ్, నటి వర్షిణి వెంకట్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • షార్ట్‌ఫిలిం పేరుతో యువకుడి నుంచి డబ్బులు తీసుకుని మోసం
  • డబ్బు తిరిగి అడగడంతో దాడి చేసి నగదు, ఫోన్లు దోపిడీ
  • బ్యాంక్ ఖాతాకు రూ.5 లక్షలు బదిలీ చేయించుకున్న వైనం
  • వర్షిణికి జ్యుడీషియల్ కస్టడీ.. మిగతా నిందితుల కోసం గాలింపు
బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 8 ద్వారా గుర్తింపు పొందిన నటి వర్షిణి వెంకట్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. షార్ట్‌ఫిలిం నిర్మిద్దామని చెప్పి ఓ యువకుడిని మోసం చేయడమే కాకుండా, అతడిని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆమెను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

గిండి ప్రాంతంలోని హాస్టల్‌లో ఉంటూ స్టాక్ ట్రేడింగ్ చేసే 26 ఏళ్ల తరుణ్ అనే యువకుడికి వర్షిణితో పరిచయం ఏర్పడింది. షార్ట్‌ఫిలిం నిర్మాణానికి పెట్టుబడి పెట్టాలని చెప్పి అతడి నుంచి డబ్బులు తీసుకుంది. అయితే, ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని తరుణ్ అడగడంతో కథ అడ్డం తిరిగింది. ఆగస్టు 22న గిండిలోని ఒక హోటల్‌కు పిలిపించిన వర్షిణి.. ఆమె స్నేహితుడు సంజయ్, మరో ఇద్దరితో కలిసి తనపై దాడికి పాల్పడినట్టు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ సమయంలో తన వద్ద ఉన్న రూ.50 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లను లాక్కున్నారని ఆరోపించాడు.

అంతటితో ఆగకుండా, ఫోన్‌లో బెదిరించి మరో రూ.5 లక్షలను తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నారని బాధితుడు తెలిపాడు. ఇంకా రూ. 27 లక్షలు ఇవ్వాలని, లేకపోతే తప్పుడు కేసులు పెట్టిస్తామని, కాల్చి చంపుతామని బెదిరించినట్లు పోలీసులకు వివరించాడు. బాధితుడి ఫిర్యాదుతో గిండి పోలీసులు వర్షిణి, సంజయ్‌ సహా నలుగురిపై మోసం, దోపిడీ, బెదిరింపు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్యాంకు లావాదేవీలను పరిశీలించి వర్షిణి ఖాతాకు డబ్బు బదిలీ అయినట్లు నిర్ధారించుకున్న తర్వాత మైలాపూర్‌లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి ఒక ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
Varshini Venkat
Bigg Boss Tamil 8
Varshini Venkat Arrest
Chennai Police
Extortion Fraud Case
Short Film Scam

More Telugu News