అనధికారికమైనా వీరేనట... 'బిగ్ బాస్-3' కంటెస్టెంట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనధికారికమైనా వీరేనట... 'బిగ్ బాస్-3' కంటెస్టెంట్లు!

  • వైరల్ అవుతున్న నాలుగైదు జాబితాలు
  • ఒకటి మాత్రం కన్ఫార్మ్ అంటున్న టీవీ వర్గాలు
  • శ్రీముఖి, తరుణ్, మాస్టర్ రఘు, శ్రీరెడ్డి, వరుణ్ సందేశ్ ఖాయమట
బిగ్ బాస్-3 హోస్ట్ ఎవరో తెలిసిపోయింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో మలి సీజన్, గతంలో కన్నా మరింతగా ఆకర్షణీయంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు అభిమానులు. ఇక, హోస్ లో పార్టిసిపెంట్స్ ఎవరు? ఇదే ఇప్పుడు మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. అనధికార వర్గాల సమాచారం ప్రకారం, హౌస్ లోకి వెళ్లే వారు వీరేనని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే నాలుగైదు జాబితాలు వైరల్ అవుతున్నాయి. అయితే, వాటిల్లో ఒకటి మాత్రం దాదాపు కన్ఫార్మ్ అంటున్నాయి టెలివిజన్ వర్గాలు.

అనధికార సమాచారమే అయినప్పటికీ, వీరే హౌస్ లోకి వెళ్లబోయే పోటీదారులట. వారిలో టాప్ యాంకర్ శ్రీముఖి, తీన్ మార్ వార్తలతో దుమ్ము రేపుతున్న జ్యోతి అలియాస్ సావిత్రి, టాలీవుడ్ లవర్ బాయ్, ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన తరుణ్, తన స్టెప్పులతో అదరగొట్టే డ్యాన్స్ మాస్టర్ రఘు, బేస్ వాయిస్ తో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన సింగర్ హేమచంద్ర, వివాదాలకు కేంద్రబిందువుగా మారి, టాలీవుడ్ ను షేక్ చేసిన నటి శ్రీరెడ్డి ఈ సీజన్ లో పోటీదారులుగా ఉంటారట.

వీరితో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టాప్ యాంకర్ ఉదయభాను, గతంలో మంచి హిట్ లు సాధించినా, ఇటీవలి కాలంలో అవకాశాలను అందిపుచ్చుకోలేని నటుడు వరుణ్ సందేశ్, కమేడియన్ వైవా హర్ష, యాంకర్ లాస్య కూడా ఉంటారట. ఇదే సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, 'మహాతల్లి' ఫేమ్ జాహ్నవి కూడా హౌస్ లో ఉంటారని తెలుస్తోంది.
Bigg Boss
Nagarjuna
Contestents

More Telugu News