ఇరాన్ పై దాడులకు ట్రంప్ ఆదేశాలు... యుద్ధ విమానాలు బయలుదేరుతుంటే ఆదేశాలు వెనక్కి!
- యూఎస్ డ్రోన్ ను కూల్చేసిన ఇరాన్
- ఇరాన్ స్థావరాలను నాశనం చేయాలని ఆదేశం
- ఆపై మనసు మార్చుకున్న ట్రంప్
ఇరాన్ లోని కీలక రాడార్లు, మిసైల్ లాంచింగ్ స్థావరాలను ధ్వంసం చేయాలని ట్రంప్ భావించినట్టు తెలుస్తోంది. గురువారం రాత్రి 7 గంటల సమయం నుంచి వైట్ హౌస్ లో ట్రంప్ రక్షణ శాఖ ఉన్నతాధికారులతో విస్తృత సమావేశాలు జరిపారని, ఇరాన్ దుందుడుకు చర్యకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని భావించిన ట్రంప్ ఈ ఆదేశాలు ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ట్రంప్ ఆదేశాలు అందగానే, పలు యుద్ధ నౌకల్లోని విమానాలు మిసైళ్లను లోడ్ చేసుకుని, బయలుదేరేందుకు సిద్ధమయ్యాయని, ఆపై మళ్లీ ఆదేశాలు రావడంతో వెనక్కు తగ్గాయని పేర్కొంది.