సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- స్పెయిన్ వెళ్లిన కీర్తి సురేశ్
- 'డిస్కో రాజా'తో అల్లరి నరేశ్
- సమంత సరదా సమాధానం
* ఇటీవల 'మహర్షి' సినిమాలో ఓ స్పెషల్ కేరక్టర్ పోషించిన అల్లరి నరేశ్ తాజాగా మరో చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. రవితేజ నటిస్తున్న 'డిస్కో రాజా' సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. ఈ విషయాన్ని నరేశ్ కన్ఫర్మ్ చేశాడు.
* అందాలతార సమంత తల్లి కాబోతోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదనే విషయాన్ని సమంత సరదాగా చెబుతూ, 'సమంత నిజంగానే తల్లి కానుందా.. ఆ విషయాన్ని మీరు కనుక్కుంటే కనుక నాకూ చెప్పండి..' అంటూ ట్వీట్ చేసింది.