srutihaasan: పారితోషికం విషయంలో మెట్టుదిగని శ్రుతిహాసన్
- లవ్ ట్రాక్ నుంచి బయటపడిన శ్రుతి
- తిరిగి సినిమాలపై దృష్టి
- రవితేజ సినిమా కోసం సంప్రదింపులు
తెలుగులో స్టార్ హీరోయిన్ గా తన జోరు కొనసాగుతోన్న సమయంలోనే, ఇక్కడి సినిమాలను శ్రుతిహాసన్ పక్కన పెట్టేసింది. బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. లవ్ ట్రాక్ లో పడిపోయి కెరియర్ ను నిర్లక్ష్యం చేసిన ఆమె, తేరుకునే సరికి చాలా ఆలస్యమే అయింది.
అయినా తెలుగు నుంచి ఆమెకి ఒక సినిమా వెళ్లింది. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని ఒక సినిమాను రూపొందించనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతిహాసన్ ను సంప్రదించారట. అయితే పారితోషికంగా ఆమె 1.5 కోట్లు డిమాండ్ చేస్తోందట. అంత అయితే కష్టమన్నప్పటికీ మెట్టు దిగడం లేదని చెప్పుకుంటున్నారు. చివరాఖరికి ఏం జరుగుతుందో చూడాలి మరి.