టీడీపీ నేత సుజనా చౌదరిపై మళ్లీ సీబీఐ దాడులు!
- హైదరాబాద్ లోని నివాసాల్లో తనిఖీలు
- బ్యాంకులను రూ.6 వేల కోట్లు మోసం చేశారని ఆరోపణలు
- ఇప్పటికే పలుమార్లు తనిఖీలు చేపట్టిన ఈడీ, ఐటీ, సీబీఐ
2018-19 మధ్యకాలంలో సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు తెలంగాణతో పాటు ఏపీలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో పలుమార్లు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సుజన ఆఫీసు, కార్యాలయాల్లో పలు కీలకపత్రాలు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సీబీఐ దాడులపై సుజనా చౌదరి ఇంతవరకూ స్పందించలేదు.