ఫ్యాక్షన్ ను ఫ్యాషన్ గా మార్చేశారు.. అందుకే పరిటాల రవికి ఫ్యాన్స్ ఉన్నారు!: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
- అనంతలో తరిమెల వంటి గొప్ప నేతలున్నారు
- రాజకీయ నాయకుడు అన్నాక 10 మందికి అన్నం పెట్టాలి
- మా హామీలను అమలుచేస్తే రాప్తాడులో పరిటాల కుటుంబం ఉండదు
చెడును తొందరగా ప్రజల్లోకి వెళుతుంది కాబట్టి ఆయన పాప్యులర్ అయ్యారని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఓ రాజకీయ నాయకుడు పది మందికి లబ్ధి కలిగేలా, పది మందికి అన్నం పెట్టేలా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించడం, ఇళ్లు కట్టించడం వంటి విషయాల్లో పరిటాల కుటుంబానికి జీరో మార్కులు వస్తాయని ఎద్దేవా చేశారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేస్తే రాప్తాడులో పరిటాల కుటుంబం ఇకపై గెలవదని జోస్యం చెప్పారు.