మా కన్నా బాగా పని చేస్తారని భావించిన ఓటర్లు అవతలి వాళ్లకు అవకాశం ఇచ్చారు: జేసీ ప్రభాకర్ రెడ్డి
- ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఓటమి
- అందుకే, అవతలి వాళ్లకు అవకాశమిచ్చారు
- ఇందుకు మేము బాధపడట్లేదు
మా కన్నా బాగా పని చేస్తారని భావించిన ఓటర్లు అవతలి వాళ్లకు అవకాశం ఇచ్చారని, ఇందుకు తాము బాధపడటం లేదని అన్నారు. ఎవరు బాగా పనిచేస్తారంటే వారిని ఎన్ను కోవడంలో తప్పు లేదని, ఇన్నాళ్లూ తమను ప్రజలు ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, దాని గురించి ఆలోచించే సమయం ఇంకా ఉందని చెప్పారు. ‘గెలుపు ముఖ్యం కాదు, మా కార్యకర్తలను కాపాడుకోవాలి’ అని అన్నారు.