హీరో విశాల్ పెళ్లి పీటలెక్కేది ఆ రోజునే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో విశాల్ పెళ్లి పీటలెక్కేది ఆ రోజునే!

  • మాస్ హీరోగా విశాల్ కి క్రేజ్ 
  • అనీషా రెడ్డితో నిశ్చితార్థం
  •  అక్టోబర్ 9వ తేదీన పెళ్లి
తమిళంలో వరుస సినిమాలతో .. వరుస విజయాలతో విశాల్ దూసుకుపోతున్నాడు. మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన విశాల్, త్వరలో 'అయోగ్య' సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాంటి విశాల్ పెళ్లికొడుకుగా పెళ్లి పందిరి దిశగా అడుగులు వేసే సమయం దగ్గరికి వచ్చేసింది. హైదరాబాద్ కి చెందిన ఒక వ్యాపారవేత్త కూతురైన అనీషా రెడ్డితో విశాల్ కి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఇద్దరి పెళ్లి ఎప్పుడా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 9వ తేదీన వీరి వివాహం జరపడానికి పెద్దలు నిర్ణయించినట్టుగా సమాచారం. అయితే వీరి వివాహం హైదరాబాద్ లో జరుగుతుందా? చెన్నై లో నిర్వహిస్తారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. త్వరలోనే విశాల్ ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.
vishal
anisha

More Telugu News