టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు!
- ఎన్నికల్లో రూ.50 కోట్ల ఖర్చు వ్యాఖ్యలు
- ఈసీకి వైసీపీ, సీపీఐ ఫిర్యాదు
- విచారణకు ఆదేశించిన ఈసీ
గతంలో ఓ మీడియా సమావేశంలో జేసీ మాట్లాడుతూ..‘అనంతపురం లోక్ సభ స్థానంలో నేను, ఇతర ప్రత్యర్థులంతా కలిసి పెట్టిన ఖర్చు రూ.50 కోట్ల వరకూ ఉంటుంది. ఇందులో ఒక పార్టీ ఎక్కువా కాదు.. మరో పార్టీ తక్కువా కాదు. అన్ని పార్టీలు కలిసి రూ.50 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టాయి’ అని అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ వ్యాఖ్యలపైనే కేసు నమోదయింది.