మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన హీరో విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన హీరో విశాల్

  • నిర్మాతల మండలికి ప్రత్యేక అధికారి
  • ఉత్తర్వులు జారీ చేసిన తమిళ సర్కారు
  • కోర్టులో పిటిషన్ వేసిన విశాల్
నిర్మాతల మండలికి ప్రత్యేక అధికారిని నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హీరో విశాల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రభుత్వం నిర్మాతల మండలిని తన చేతుల్లోకి తీసుకుని ఎన్ శేఖర్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించిన నేపథ్యంలో విశాల్ కోర్టుకెక్కాడు.

ప్రస్తుతం ఉన్న కార్యవర్గం కాల పరిమితి పూర్తయిందని గుర్తు చేసిన ఆయన, ఆదాయ, వ్యయాలను సభ్యుల ముందు పెట్టేందుకు 1న సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేశామని, అప్పుడే తదుపరి ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని, ఈ దశలో ప్రత్యేక అధికారి అవసరం లేదని కోర్టుకు తెలిపారు. తన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని విశాల్ కోరగా, అందుకు అంగీకరించిన న్యాయమూర్తి, మంగళవారం నాడు వాదనలు వింటామని పేర్కొన్నారు. దీంతో విశాల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది.
Vishal
Chennai
High Court

More Telugu News