కేరళలోని కన్నూరులో విచిత్రం.. వీవీప్యాట్ యంత్రంలో తాపీగా చేరిన పాము!
- ఓటేసేందుకు వచ్చి అదిరిపడ్డ ప్రజలు
- పాములు పట్టే వ్యక్తి సాయంతో తొలగింపు
- విచారణ ప్రారంభించిన అధికారులు
ఈ సందర్భంగా కొద్దిసేపు పోలింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వీవీప్యాట్ లోకి పాము దానంతట అదే వచ్చిందా? లేక ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు ఎవరైనా వదిలివెళ్లారా? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 117 స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.