Advertisement

పంట కాలువకు అడ్డుగోడ.. కాంట్రాక్టర్, అధికారిపై కేసు నమోదు

Nimmala Ramanaidu orders case against contractor and official for crop canal wall
  • కోనసీమలో పంట కాలువకు అడ్డంగా గోడ నిర్మాణం
  • మంత్రి నిమ్మల రామానాయుడుకు నేరుగా ఫిర్యాదు చేసిన రైతులు
  • కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ అధికారిపై కేసు నమోదు చేయాలని మంత్రి ఆదేశం
  • అయినవిల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అధికారులు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంట కాలువకు అడ్డంగా గోడ నిర్మించి, సాగునీటి ప్రవాహాన్ని అడ్డుకున్న ఘటనపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. రైతుల ఫిర్యాదు మేరకు స్పందించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో, సదరు కాంట్రాక్టర్‌తో పాటు ఆర్ అండ్ బీ (R&B) శాఖ అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ముక్కామల, నడిపూడి గ్రామాల మధ్య ఉన్న ప్రధాన పంట కాలువకు అడ్డంగా 'సుధారామ కన్‌స్ట్రక్షన్స్' అనే సంస్థ రిటర్నింగ్ వాల్ (అడ్డుగోడ) నిర్మించింది. దీనివల్ల తమ పొలాలకు సాగునీరు అందడం లేదని స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 17న కాలువల పరిశీలనకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి రైతులు ఈ సమస్యను నేరుగా తీసుకెళ్లారు.

రైతుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన మంత్రి, ఈ అక్రమ నిర్మాణానికి బాధ్యులైన వారిపై వెంటనే పోలీసు కేసు నమోదు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు కొత్తపేట ఇరిగేషన్ ఏఈ సాయి పవన్ అయినవిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా కాంట్రాక్టర్ పి. పద్మరాజు, ఆర్ అండ్ బీ డీఈఈ నిక్కీ క్రూజ్‌లపై క్రైమ్ నం. 85/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 326(ఎ), 326(బి), 326(సి) రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.                                
Advertisement
Nimmala Ramanaidu
Konaseema crop canal wall case
Sudharama Constructions contractor
Andhra Pradesh irrigation department
Konaseema district police case
P Padmaraju and Nikki Cruz case

More Telugu News