రీల్స్ ప్రేమ రియల్ లైఫ్‌లోకి.. ఒకే యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
- కెమెరామ్యాన్‌ను వివాహమాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
- విడిపోవడం ఇష్టం లేకే నిర్ణయమన్న వధువులు
- గుడిలో రహస్యంగా సాగిన వివాహ వేడుకలు
- హిందూ చట్టం ప్రకారం చెల్లదంటున్న న్యాయకోవిదులు
- ఫిర్యాదు అందలేదన్న అమ్రోహా జిల్లా పోలీసులు
సోషల్ మీడియా స్క్రీన్‌పై వారిది రోజూ కనిపించే ఒక సరదా లోకం.. కానీ, ఆ డిజిటల్ తెర వెనుక రూపుదిద్దుకున్న బంధం ఇప్పుడు ఒక నమ్మశక్యం కాని నిజ జీవిత దృశ్యంగా మారింది! ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లాలోని ధౌరియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి (19), సంతోష్ (18) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లకు (ఇందులో ఒకరు వరుసకు చెల్లెలు) సోషల్ మీడియాలో షార్ట్స్, రీల్స్ చేయడం ఒక అలవాటు. తమ నిత్య జీవితంలో సరదా వీడియోలు తీస్తూ నెటిజన్లను అలరించే ఈ ముగ్గురికి, సమీపంలోని శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కీ (20) పరిచయమయ్యాడు. గత ఆరు నెలలుగా వారి వీడియోలకు కెమెరామ్యాన్‌గా పనిచేస్తూ, కొన్నిసార్లు రీల్స్‌లో భర్త పాత్రలు కూడా పోషించేవాడు. అయితే, ఈ ఆన్‌లైన్ ప్రయాణం వారి జీవితాల్లో ఊహించని మలుపు తిరుగుతుందని ఎవరూ ఊహించలేదు.
కుటుంబ సభ్యులు తమకు వేర్వేరుగా పెళ్లిళ్లు చేయాలని నిశ్చయించినప్పుడు ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తమను వివాహం విడదీస్తుందనే ఆలోచనే వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చినట్లు బి. టెక్ రెండో సంవత్సరం చదువుతున్న పెద్దమ్మాయి సరోజ్ వెల్లడించింది. "చనిపోవడం కంటే, ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించడమే మేలని భావించాం. మేమంతా మేజర్లుగానే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆమె స్పష్టం చేసింది. చెల్లెళ్ల ప్రేమానురాగాలను అర్థం చేసుకున్న కెమెరామ్యాన్ వికాస్ కూడా వారి ప్రతిపాదనకు అంగీకరించాడు.
ఎవరూ లేని వేళ స్థానిక దేవాలయంలో ఈ ముగ్గురి నుదుటన వికాస్ బొట్టు పెట్టి వివాహం చేసుకుంటున్న వీడియోలు నెట్‌లో వైరల్‌గా మారడంతో ఈ విచిత్ర పెళ్లి వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ వేడుకకు చట్టపరమైన చిక్కులు వచ్చిపడ్డాయి. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక పురుషుడు ఒకే సమయంలో బహుభార్యత్వాన్ని కలిగి ఉండటం తీవ్ర నేరమని, ఈ పెళ్లికి ఎలాంటి న్యాయబద్ధత ఉండదని అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, తమ వద్దకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అందరూ మేజర్లు కావడం వల్ల ప్రస్తుతం చట్టపరంగా పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. రీల్స్ కోసం కెమెరా ముందు భార్యాభర్తలుగా నటించినవారు, ఇప్పుడు జీవితంలోనూ ఒకటవ్వడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.